President's Message

Reshma Thummadi
TASF President
నమస్కారం,
దక్షిణ ఫ్లోరిడా లోని తెలుగు వారందరికీ మరియు నా తోటి సంఘ సబ్యులకు నమస్కారం!
మన సంస్థ బాధ్యతలు నేను స్వీకరించుట ప్రత్యేకంగా అనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా దీని పురోభివృద్ధికి తమ వంతు సాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
మన ఆత్మీయుల్ని వదిలి ఈ దేశానికి బ్రతుకు తెరువు కోసం వచ్చినా, మన ప్రేమలు, అనుబంధాలు ఎక్కడికి పోలేదు, మన గుండెల్లో శాశ్వతంగా మనతోనే ఉంటాయి. అవే మనందరినీ ఈ సంఘం లో సభ్యులుగా చేర్చాయి, మన అందరిని ఒక కుటుంబంగా మార్చాయి. మన కుటుంబ అనుబంధాల్ని మరింత దృఢపరచడం, మరింత విశాలం చెయ్యటం అనే దృష్టితో ముందడుగు వేద్దాం.
ప్రేమని అందరికి పంచటమే మన సంస్కృతి. ఆ సంస్కృతిని కాపాడటానికి మన ముందు తరాలకి అందివ్వడానికి, ఇంకా ఏమి చేస్తే బాగుంటుందో సమీక్షించి మరింత దృఢంగా సాగిపోదాం.
తేనెలొలికే తెలుగు భాషని తేనెలొలుకు మన పిల్లలకు మరింత దగ్గర చెయ్యటానికి, వారిని కుడా ఈ సంస్థ పురోగతిలో భాగస్వాములను చెయ్యటానికి చెయ్యవలసిన కార్యక్రమాలను రూపుదిద్దుదాం.
ఈ లక్ష్యాలను చేరటానికి, మన సంఘం మరింత పురోగతికి మీ అందరి ఆలోచనలు, ఉద్దేశాలు నాతో పంచుకుంటారని ఆశిస్తున్నాను. ఉత్సాహవంతులైన మన సంఘ సభ్యులు ఎల్లవేళలా నాకు చేదోడు వాదోడు గా ఉంటారని, ఈ సంస్థ పురోగతికి మరొక్కసారి మీ సహాయ సహకారాల్ని కోరుకుంటూ సెలవు తీసుకొంటున్నాను.
Welcome and thank you for visiting the official website of Telugu Association of South Florida (TASF).